డబ్బు సంచులతో మంత్రుల ప్రలోభాలు

నంద్యాలః రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి మంత్రులు డబ్బు సంచులతో నంద్యాలలో కూర్చొని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. స్వయాన ముఖ్యమంత్రి నంద్యాలకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే...ఓటుకు రూ. 5వేలు ఇస్తానని చెబుతున్నాడంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. నా పెన్షన్లు, నా రోడ్ల మీద తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు. నీ జేబులోంచి తీసిచ్చావా బాబు డబ్బులు అంటూ ఫైర్ అయ్యారు. నంద్యాలలో ఉపఎన్నిక రాబట్టే బాబు, మంత్రులు రోడ్లమీద తిరుగుతున్నారని, ఉపఎన్నిక లేకపోతే వాళ్లు ఒక్కసారైనా  నంద్యాలకు వచ్చేవారా అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని జోగి అన్నారు. నంద్యాల ఉపఎన్నిక వచ్చిందనే రూ. 2వేల కోట్ల జీవోలిచ్చారని,  తర్వాత బాబు, మంత్రులు ఎవరూ కనబడరని ఎద్దేవా చేశారు. జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయతతో, ప్రేమగా దీవిస్తున్నారని, నంద్యాల ప్రజలు వైయస్సార్సీపీని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.

Back to Top