రుణ మాఫీపై మళ్ళీ టీడీపీ ప్రభుత్వం మోసం

హైదరాబాద్, జూలై 31: రుణాల మాఫీపై రైతులను మళ్ళీ మోసం చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సాప్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె.పార్థసారధి ధ్వజమెత్తారు. రుణ మాఫీపై దాగుడు మూతలు ఆపి రుణ మొత్తాన్నా బ్యాంకులకు ఎప్పుడు చెల్లిస్తారో, ఖరీఫ్ వ్యవసాయానికి కొత్త రుణాలు ఎప్పుడు, ఎలా ఇప్పిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వసనీయతపై రైతులకు నమ్మకం లేకపోయినా తమ పంట రుణాలన్నీ రద్దవుతాయన్న ఆశతో నమ్మి ఓట్లేశారని, కానీ తీరా అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసే చంద్రబాబు తన నైజాన్ని మళ్ళీ చాటుకున్నారని దుయ్యబట్టారు.

విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు

స్థానికతపై తెలంగాణా ప్రభుత్వం 36 నంబరు జీవోను జారీ చేయడం చాలా బాధాకరమని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పార్థసారధి డిమాండ్ చేశారు. స్థానికత, ఫీజు రీయింబర్సమెంట్ పై సందిగ్ధతను కొనసాగిస్తూ విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీయొద్దన్నారు.

Back to Top