<br/>కర్నూలు: కృష్ణా జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకట్రామ్ చౌదరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గంజిహల్లిలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం ఎంవీఆర్ చౌదరి వందలాది మంది కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్‌సీపీలో చేరారు. చౌదరికి పార్టీ కండువా కప్పి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎంవీఆర్ చౌదరి మాట్లాడుతూ..ఏళ్ల తరబడి టీడీపీకి సేవలందించిన తగిన గుర్తింపు రాకపోవడంతో విసుకు చెంది వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. వైయస్ జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ కృష్ణా జిల్లా నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.