కుంభకోణాల ప్రభుత్వం

హైదరాబాద్ః చంద్రబాబు ఆంధ్ర ప్రజల సొమ్మును సింగపూర్ కు ధారాదత్తం చేయడం పట్ల వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. బాబు సింగపూర్ కంపెనీలతో టై అప్ అయి లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కోర్టులు, కమిటీలు తప్పుబట్టినా వినకుండా మొండి వైఖరితో ముందుకెళ్లడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చట్టాన్ని సవరించాక మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారాయణ చెప్పడం దురదృష్టకరమన్నారు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాబు సర్కార్ భారీ కుంభకోణాలకు పాల్పడుతుందని విమర్శించారు.
Back to Top