సభను వాయిదా వేసి పారిపోయారు

  • ప్రజాసమస్యలపై మాట్లాడిన ప్రతిసారి మైక్ కట్ చేశారు
  • ఎప్పటిలానే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు
  • మేం విసిరిన ఏసవాల్ ను చంద్రబాబు స్వీకరించలేదు
  • తమకు ప్రజాసమస్యలే ముఖ్యం..అధికారపక్షానికి జగనే ఓ సమస్య
  • మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్ 
వెలగపూడిః ప్రజాసమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై తాము చర్చకు పట్టుబడితే సమాధానం చెప్పలేక ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పారిపోయిందని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎద్దేవా చేశారు. ఈ సెషన్ మొత్తం అప్రజాస్వామికంగానే జరిగిందని తెలిపారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంద్రబాబు ఆనందించారని ఫైర్ అయ్యారు . ప్రజాసమస్యలపై తాము మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మైక్ కట్ చేశారని, అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలానే తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారని దుయ్యబట్టారు. సభలో మేం విసిరిన ఏ సవాల్ ను బాబు స్వీకరించలేదని అన్నారు.   అగ్రిగోల్డ్, పేపర్ లీక్ , ఆక్వా తదితర అంశాలపై తాము చర్చకు పట్టుబడితే వాయిదాలతో కాలక్షేపం చేశారని తూర్పారబట్టారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. 

ప్రత్యేకహోదాపై తీర్మానం అడిగితే ప్రభుత్వం పట్టించుకోలేదని వైయస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశామన్నారు. అదేవిధంగా నారాయణ స్కూళ్లో పదవ తరగతి పేపర్ లీకేజీ స్కాంపైనా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశామన్నారు. ఏ అంశంపై కూడ ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదన్నారు. తమకు ప్రజాసమస్యల పరిష్కారమే ముఖ్యమని వైయస్ జగన్ స్పష్టం చేశారు. అధికారపక్షానికి జగనే ఓ సమస్య అని అన్నారు. సభలో పార్టీ మారిన వారిని అధికారపక్షంవైపు కూర్చోబెట్టి ప్రజాసమస్యల విలువలను దిగజార్చారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవులిస్తే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Back to Top