హోదాపై చర్చకు పారిపోయిన టీడీపీ..సభ రేపటికి వాయిదా

హైదరాబాద్ః ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అధికార టీడీపీ సభా సంప్రదాయాలను మంటగల్పింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేకహోదాపై చర్చ జరపాలని ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టగా...అధికార పార్టీ పారిపోయింది. రెండో రోజు సభను మధ్యాహ్నంలోపే వాయిదా వేయించుకొని వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రజానీకమంతా హోదాను కోరుకుంటుంటే ...టీడీపీ మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి...ప్రతిపక్షం గొంతు నొక్కతూ, మూడు రోజుల సమావేశాలను ప్రభుత్వం తూతుమంత్రంగా నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రజలు మండిపడ్డారు.

Back to Top