అరచేతిలో వైకుంఠం

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. మంగళవారం ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులపై ఆయన సభలో మాట్లాడారు.  ప్రజా సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.ఎస్సీ సంక్షేమానికి ఖర్చు పెట్టే విషయంలో ఎందుకు ఇంత వ్యత్యాసం వస్తుందని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ కుటుంబాలు 2.40 లక్షలు ఉన్నాయని తెలిపారు. వీరిలో సుమారు 5 లక్షల మందైనా రుణాలు పొందేందుకు అర్హులు లేరా అని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎంత ఖర్చు చేశారో  మంత్రి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి మంత్రి రావెల కిశోర్‌కు అవకాశం కల్పించారు. దీంతో మరోమారు వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు నిరసన తెలిపారు.

Back to Top