టీడీపీ పాలనంతా కబ్జాలమయం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పరిపాలన అంతా కబ్జాలమయమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. వించిపేటలో పీర్లసావిడిలో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మైనార్టీలు ఆందోళన చేపట్టారు. ముస్లింల నిరసనకు వెల్లంపల్లి శ్రీనివాసులు మద్దతు తెలిపారు. వించిపేటలో పీర్ల సావడి స్థలాన్ని టీడీపీ నేతలు కబ్జాకు యత్నించారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ అనుచరులు పీర్లకు సంబంధించిన సామగ్రిని బయటపడేసి దాంట్లో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని నిరసిస్తూ ముస్లింలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు మైనార్టీ ద్రోహి అని ఆరోపించారు. మైనార్టీలకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. 
Back to Top