వైయస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చరౌడీల దాడి

విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి.  అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెలుగుదేశం కార్యకర్తలు వైయస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.  ఈ దాడిలో మర్తా శంకర్‌, మర్తా నరసింహరావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని భవానీపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కంచికచర్లలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా టీడీపీ నాయకులు జెడ్పీటీసీ కోగంటి బాబు నేతృత్వంలో టీడీపీ గూండాలు ఇళ్లపైకి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో వారు  వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.  అర్ధరాత్రి సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద పెత్తున దాడికి దిగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. 

తాజా ఫోటోలు

Back to Top