రెచ్చిపోయిన పచ్చ గుండాలు

కర్నూలు: అధికార తెలుగు దేశం పార్టీ నేతల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. కర్నూలు జిల్లా డోన్‌లో పచ్చ తమ్ముళ్లు రెచ్చిపోయారు. మున్సిపాలిటీ టెండర్ల విషయంలో తమకే పోటికొస్తారా అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై భౌతిక దాడికి పాల్పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ప్రసాద్‌ పరిస్థితి విషమంగా మారింది. శుక్రవారం డోన్‌ మున్సిపాలిటీలో టెండర్లు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు క్రరలు, కత్తులతో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో డోన్‌ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Back to Top