బాబు డైరక్షన్ లో పచ్చ గూండాల దాడి

  • అనంతలో పచ్చనేతల గూండాయిజం
  • వైయస్ జగన్ యాత్రను జీర్ణించుకోలేక దౌర్జన్యాలు
  • వైయస్సార్సీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి
  • బాబు దాదాగిరిపై మండిపడ్డ వైయస్సార్సీపీ నేతలు
  • చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడి

  • అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు దాదాగిరికి దిగుతున్నారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో వైయస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. చంద్రమోహన్ రెడ్డి అనే వైయస్సార్ సీపీ కార్యకర్తను పచ్చరౌడీలు కత్తులతో పొడిచారు.  చంద్రమోహన్ రెడ్డిని వైయస్సార్సీపీ నేతలు  ఆస్పత్రికి తరలించారు.

    టీడీపీ దాడులపై  అనంతపురం జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రపై  చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక బాబు తన గూండాలతో దాడులు చేయిస్తున్నారని ఫైరయ్యారు.  టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ  ధర్నా చేసి తీరుతామని చెప్పారు. అయితే వైయస్ జగన్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు.

    టీడీపీ నేతల రౌడీయిజాన్ని  వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. తాగుబోతులతో వైయస్ జగన్ యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేస్తున్నారంటూ వారు దుయ్యబట్టారు.  చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతుల్లో మనోస్థైరం కల్పించేందుకు వైయస్ జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుర్నాథ్ రెడ్డి ఆగ్రహించారు.
Back to Top