ప్ర‌జ‌ల సొమ్ము దోచుకుతింటున్న టీడీపీ

నంద్యాలః ప్ర‌జ‌ల సొమ్మును ఇష్టారీతిగా దోచుకుతింటున్న చంద్ర‌బాబు, టీడీపీ మంత్రుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ను విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని వైయ‌స్ఆర్ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నంద్యాల వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీ చ‌క్ర‌పాణిరెడ్డితో రాజీనామా చేయించి నీతివంత‌మైన రాజ‌కీయాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ తెర‌లేపార‌న్నారు. దొంగ రాజీనామాలు చేయ‌కుండా స్పీక‌ర్ ఫార్మ‌ట్‌లో రాజీనామా చేశార‌న్నారు. ఐదు సార్లు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓడిపోయి అడ్డ‌దారిలో మంత్రి అయిన సోమిరెడ్డి, చంద్ర‌బాబు క‌లిసి ప్ర‌జ‌ల సొమ్ము దోచుకుతింటున్నార‌న్నారు. వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వైయ‌స్ఆర్ పెట్టిన బిక్ష‌తో ఎమ్మెల్యే అయ్యాడ‌న్నారు. టీడీపీ ముఖ్య నాయ‌కుడిని హ‌త్య చేయించిన చ‌రిత్ర ఆదినారాయ‌ణ‌రెడ్డిద‌న్నారు. ప‌రిటాల కుటుంబ హ‌త్యా రాజ‌కీయాల‌కు ఎన్నో కుటుంబాలు బ‌ల‌య్యాయ‌ని, అలాంటి చ‌రిత్ర గ‌ల ప‌రిటాల సునీతకు వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించే స్థాయి లేద‌న్నారు. 

Back to Top