రైతులను రెచ్చగొడుతున్న టీడీపీ

హైదరాబాద్, అక్టోబర్ 13: సర్వసతి సిమెంట్ కంపెనీ వ్యవహారంలో రైతులను రెచ్చగొడుతూ విద్వేషపూరిత రాజకీయాలు నడుపుతున్న టీడీపీ వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎండగట్టింది. నానాటికీ పెరిగిపోతున్న టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల జాబితా నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి చౌకబారు ప్రయత్నాలకు ఆ పార్టీ ఒడిగడుతోందని విమర్శించింది.

'తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ రైతులను శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైకి ఉసిగొల్పి ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. అయితే వారి కుటిల యత్నాలు వారికే బెడిసికొడతాయని గ్రహించడం మరచిపోవద్దు' అని పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి సోమవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమవేశంలో హెచ్చరించారు.

నినాదాలు చేసుకుంటూ లోటస్ పాండ్ కు వచ్చిన వాళ్ళు నిజానికి రైతులే కాదు. వారు ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే. వారిని టీడీపీనే ప్రోత్సహించి, పురిగొల్పి తప్పుడు ఆరోపణలతో శ్రీ జగన్ మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి అనే ముద్ర వేసే కుటిల ప్రయత్నం చేసింది. అయితే వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది.
సరస్వతి సిమెంట్ కోసం భూమిని రైతుల నుంచి నేరుగా సేకరించినది. రైతులకు మార్కెట్ రేటు చెల్లించి భూములను కొనుగోలు చేయడం జరిగింది. ఫ్యాక్టరీ నిర్మించే వరకు ఆ భూములను సాగు చేసుకోవడానికి కూడా రైతులను అనుమతించడం జరిగింది. ఏళ్ళు గడుస్తున్నా అనుమతులు రాకపోవడంతో ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించలేదు. అయితే టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి సిమెంట్ కంపెనీకి ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేసింది.

అదే ప్రాంతంలో అంబుజా సిమెంట్ తోపాటు అనేక కంపెనీలు ఉన్నాయి. అవి కూడా ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం కేవలం సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రమే మైనింగ్ హక్కులను రద్దు చేసింది. ఎందుకంటే ఆ కంపెనీ బోర్డులో వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో.

శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ధర్నా నిర్వహించడానికి ముందుగా టీడీపీ దీని కోసం ఒక స్క్రిప్టు తయారు చేసింది. ముందుగా రైతులుగా చెప్పుకుంటున్న ఒక బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి సరస్వతి సిమెంట్ భూములపై ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత ధర్నాకు దిగారు. దీనిని బట్టి దీని వెనుక ఉన్న వ్యక్తులెవరో వారి దురుద్దేశాలు ఏమిటో స్పష్టంగా అర్థమైపోతుంది. శ్రీ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ధర్నా చేసిన వారు కేవలం టీడీపీ కార్యకర్తలు తప్ప రైతులు కారు అని కృష్ణమూర్తి చెప్పారు.

వెనుకబడిన పల్నాడు ప్రాంతం అభివృద్ది చెందాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే తప్ప స్థానికులకు ఉపాధి లభించడం. టీడీపీ ఈ దిశగా పని చేయాల్సిందిపోయి రాజకీయ కారణాలతో పరిశ్రమల ఏర్పాటును అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య.

రైతుల ముసుగు కప్పుకొని టీడీపీ కార్యకర్తలు మా అధినాయకుడి నివాసం దగ్గర ధర్నా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పారిశ్రామికీకరణకు తద్వారా స్థానికులకు ఉపాధి కలిగించేందుకు గాను మైనింగ్ లీజును పునరుద్దరించవలసిందిగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top