బీజేపీతో మరోసారి పొత్తుకు టీడీపీ సై


అసెంబ్లీ సీట్ల పెంపుకై అంటూ సెక్రటేరియట్‌ నుంచి వార్తలు
ఎమ్మెల్సీ పయ్యావులవి మతిభ్రమించిన వ్యాఖ్యలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు

విజయవాడ: నియోజకవర్గ సీట్లు పెంచితే బీజేపీతో మరోసారి పొత్తుపెట్టుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు సెక్రటేరియట్‌ నుంచి వార్తలు వస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు తన తోకపత్రికలు, ఛానళ్లతో దుష్ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరితో పొత్తు పెట్టకుంది లేదని, భవిష్యత్తులో కూడా పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రాందాస్‌ చేసిన వ్యాఖ్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు చేసిన వ్యాఖ్యలపై మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ తలాతోక లేని పార్టీ అని, ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణతో మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు పులి అయితే.. ఎందుకు కేంద్రాన్ని చూసి భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఎందుకు మద్దతుగా నిలవాలో చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేశారా.. లేక ప్రత్యేక హోదా, విభజన అంశాలను సాధించారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టే చంద్రబాబు ఇంతలా భయపడుతున్నారన్నారు. 
Back to Top