ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవను


 


 
చిత్తూరు: త‌న‌ను ఎంత‌గా ప్ర‌లోభ‌పెట్టినా..ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా వెర‌వ‌న‌ని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సునీల్‌కుమార్ పేర్కొన్నారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని ఆయ‌న‌ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో  జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు.  


Back to Top