కొండను తవ్వి ఎలుకను పడుతున్నారు

విజయవాడః కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో కొండను తవ్వి ఎలుకను పడుతున్నారు పోలీసులు.  సభ్యసమాజం తలదించుకునేలా మహిళల జీవితాలతో చెలగాటమాడిన అసలు దోషులను వదిలి చిన్నచేపలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాల్ మనీ ముసుగులో మహిళల మాన ప్రాణాలతో ఆటలాడిన అధికార పార్టీ నేతలు బయట దర్జాగా తిరుగుతున్నా చర్యలు శూన్యం. 

సెక్స్ రాకెట్ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారు.  చంద్రబాబు దోషులను కాపాడుతుండండతో  పోలీసులు అసలు నిందితుల జోళికివెళ్లడం లేదు.  వందలాది బాధితులు ప్రతి రోజు సీపీ కార్యాలయానికి ఫిర్యాదుల కోసం బారులు తీరుతున్నారు. సెక్స్ రాకెట్ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేతల పేర్లు స్వయంగా వెల్లడిస్తున్నారు. అయినా  వారిపై కేసులు లేవు. దర్యాప్తు అంతకన్నా లేదంటే చంద్రబాబు నేరగాళ్లకు ఎలా అండగా నిలుస్తున్నారో అర్థం అవుతోంది.  
Back to Top