వైయస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం కుట్ర బట్టబయలు

దెందులూరు: పచ్చరౌడీలు హత్యారాజకీయాలతో చెలరేగిపోతున్నారు. బాబు అధికారంలోకి వచ్చాక 16మందికి పైగా వైయస్సార్సీపీ నేతలను పొట్టనబెట్టుకున్న టీడీపీ గూండాలు.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో వైయస్సార్సీపీ కార్యకర్త హత్యకు పన్నిన పన్నాగం బట్టబయలైంది.   దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కొత్తపల్లి రమేష్ పై టీడీపీ నేతల హత్యాయత్నం కుట్ర వెలుగులోకి వచ్చింది.  రమేష్ ను హత్య చేసేందుకు రామారావుగూడెం టీడీపీ ఎంపీటీసీ శోభన్ బాబు పథకం రచించాడు. కొత్తపల్లి రమేష్‌ను హత్య చేయాలని రౌడీషీటర్ బ్రహ్మానందంతో రూ. 25 వేల అడ్వాన్స్‌ చెల్లించి ఒప్పందం చేసుకున్నాడు. రౌడీషీటర్ మనసు మార్చుకోవడంతో విషయం బయటకు వచ్చింది. కొత్తపల్లి రమేష్‌ ఫిర్యాదు మేరకు టీడీపీ ఎంపీటీసీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Back to Top