టిడిపి ఎంపిలు కూడా రాజీనామాలు చేయాలి


ప్రజా, పౌర, విద్యార్ధి సంఘాలు పాల్గొనాలి.
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు
హోదా పోరులో పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలి
రాష్ట్రం కోసం అందరం ఒకే గొంతుకతో ఢిల్లీపెద్దలతో పోరాటం చేయాలి

విజయవాడ : ప్రజాస్వామ్య యుతంగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా  సాధనకు ప్రజాస్వామ్య యుతంగా వైయస్ ఆర్ సీపీ ప్రకటించిన ఆందోళనా కార్యక్రమానికి విద్యార్ధి, ఉద్యోగ, పౌర, ప్రజా సంఘాలన్నీ సహకరించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వైయస్ ఆర్ కాంగ్రెస్  లోకసభలో అవిశ్వాస తీర్మానం పెట్టినా చర్చకు రావడం లేదని, పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన వెంటనే ప్రజల నుంచి ఎన్నికలైన పార్లమెంటు సభ్యులందరూ రాజీనాామా చేసి, ఢిల్లీలో ఆమరణ దీక్షకు పూనుకుంటారని పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నిర్ణయానికి మద్థతుగా, అదే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు చేపడతామని ప్రకటించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో  మల్లాది విష్ణు, మాజీ మంత్రి కె.పార్థసారథిలతో కలిసి ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆందోళనలు చేస్తున్న వారిపై పెట్టిన కేసులన్నిటిని భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 


చట్టంలోని ఉన్న అంశాలను అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కన కేంద్ర ప్రభుత్వంలో  టిడిపి కూడా భాగస్వామి ,అయితే ఇక్కడి ప్రభుత్వంలోని పెద్దల బలహీనతలు ఆసరా చేసుకుని 
కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. వైయస్ ఆర్ సీపీ ఆది నుంచి కూడా విభజన చట్టంలోని హామీల అమలుకు పోరాటం చేస్తున్నప్పటికీ , ఫలితం రాకపోవడంతో, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దపడి, వివిధ పక్షాల మద్ధతు కూడగట్టినప్పటికీ, ఆ అంశం చర్చకు రానీయకుండా చేస్తున్న నేపథ్యంలో , పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన రోజునే ప్రజలతో ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యులంతా రాజీనామాలు చేయాలని నిర్మయించామన్నారు. అంతటితో ఆందోళనలు ఆపకుండా, కేంద్రంపై మరింత ఉధృతంగా పోరాటం చేయడానికి, ఢిల్లీ లోని పెద్ల ఆలోచన తీరులో మార్పు వచ్చేలా , రాజీనామాలు చేసిన వారంతా ఢిల్లీలోని ఎపి భవన్ లోనే నిరవధిక దీక్షకు పూనుకుంటారన్నారు.  ఈ దీక్షలకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా, పౌర, విద్యార్ధి సంఘాల మద్దతు నిచ్చి సంఘీభాం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన బలహీనతలను పక్కకు పెట్టి, రాజీనామాలు చేసిన ఎంపిలతో కలిసి రావాలని , ఎన్ డిఎ ప్రభుత్వం తలలు వంచుదామని పిలుపునిచ్చారు. టిడిపి ఎంపిలు కూడా తమతో కలిసి వచ్చిన రాజీనాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

నియోజకవర్గాల్లో రిలే దీక్షలు

ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు ఏ రోజైతే దీక్షను ప్రారంభిస్తారో, అదే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా రిలే నిరాహార దీక్షలకు దిగుతారని , నాలుగేళ్లలో అలసత్వాన్ని ప్రదర్శించిన ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. 
ఈ ఆందోళనలకు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న అన్ని సంఘాలు, పక్షాలు మద్ధతు పలకాలని కోరారు. అందరం కలిసికట్టుగా పోరాడి, రాష్ట్రాన్ని కాపాడుకుందామని, యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని కోరుతూ, ఇందులో టిడిపి కూడా పాల్గొనాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
రు.

 

 కేసులు ఎత్తివేయాలి

ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారం పై చిత్తశుద్ధి ఉంటే, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధన కోసం కొన్ని సంంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్న  ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్ధులు, రాజకీయ సంఘాలపై పెట్టిన కేసులన్నిటిని భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
 టిిడిపి ఎంపిలు కూడా రాజీనామాలు చేసి ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని, ఇందులో భాగస్వామ్యం కాకుంటే సమాజం క్షమించదని అన్నారు. ప్రత్యేక హోదా పోరు కీలక దశలో రాష్ట్రం మొత్తం, ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచవచ్చన్నారు.
 ప్రత్యేక హోదా కోసం వైయస్ ఆర్ సీపీ పూర్తి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎంతటి పోరుకైనా సిద్ధమని ఈ పాటికే ప్రకటించిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లలో ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఒక్క సారి కూడ ప్రత్యేక హోదా కావాలని ప్రధాన మంత్రిని గట్టిగా అడగలేదని, అయితే ఇప్పుడు ప్రజా ఆందోళన హెచ్చడంతో తన మాటల గారడీతో, తనదైన ప్రజ్ఞతో తానెంతో చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి రాజకీయాలతో కాకుండా ప్రజల పక్షాన ప్రజా ప్రయోజనాల ముఖ్యంగా వైయస్ ఆర్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇకనైనా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ , రాష్ట్రమంతటా, ఒకే మాట, ఒకే గుంతుకగా పోరాటం చేసి, ఢిల్లీపై వత్తిడి తెద్దామని, ఇందుకోసం టిడిపితో అన్ని సంఘాలు తాము చేస్తున్న ఆందోళనలకు మద్ధతు పలకాలని పార్టీ తరపున కోరారు.

తాజా వీడియోలు

Back to Top