టిడిపి ఎంపిలు రాజీనామా చేయాలి...ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఢిల్లీ : ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని, దానికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న తమతో తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైయస్ ఆర్ సీపీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఢిల్లీ సంసద్ మార్గ్ లోప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్ సీపీ చేస్తున్న మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తో కలిసి రావాలి, అవిశ్వాస తీర్మానానికి కలిసి రండి, సభ్యులతో రాజీనామా చేయించి చంద్రబాబు నాయుడు, టిడిపి తమ  చిత్తశుద్ధి నిరూపించుకోవాలని , లేకుంటే, కేంద్రంతో కుమ్మక్కు అయినట్లుగా నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీలపై  మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి వాటన్నిటిని నెరవేర్చేలాగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాతం పోరాటం చేస్తోంది . పార్లమెంటు, అసెంబ్లీ, బయట అన్ని విధాలుగా పోరాటాలు చేస్తున్నాం. ఇవన్నీ  చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో లాలూచి పడ్డ కారణంగా మనకు రావాల్సినవి ఏ ఒక్కటి కూడా రావడం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేది రాష్ట్ర ప్రజలందరిలోనూ నెలకొంది. ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయని భవిష్యత్తు తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పోరాటాలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం,  లాలూచి పడటం తో వెనక్కుపోయింది.  ప్రత్యేక హోదా కోసం  అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు ఏమయ్యాయోచెప్పాలని చంద్రబాబు ను డిమాండ్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు విభజన సమయంలో ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని, సంస్థల ఏర్పాటు, పెట్రో క్యారిడార్ వంటి వాటన్నిటిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా పోరు ఆగదని ప్రకటించారు. 

జైట్లీగారు అర్ధరాత్రి పూట హోదా కాదు, ప్యాకేజి అంటూ ప్రకటిస్తే, చంద్రబాబు కూడా  దానిని స్వాగతించిన విషయాన్ని  గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అనేది హక్కుగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. హోదా ఇవ్వకపోతే, తమ పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు.   వైయస్ఆర్ సీపీ కి కావాల్సింది, తాత్కాలిక ప్రయోజనాలు కాదు, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను దేశ ప్రజలందరి దృష్టికి మరోసారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామన్నారు. ఈ నెల 21 న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతాం, పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని, అప్పటికీ రాకపోతే, ఏప్రిల్ 6 న ఎంపిలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. 

తాజా వీడియోలు

Back to Top