టిడిపి ఎంపిల నిజ స్వరూపం వెల్లడైంది

విజయవాడ, 15 అక్టోబర్ 2013:

లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నో‌ట్‌తో వచ్చన నేపథ్యంలో రాజీనామాల విషయంలో టిడిపి ఎంపిల నిజస్వరూపం మొత్తం వెల్లడైందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకుడు జోగి రమే‌ష్ ఎద్దేవా చేశారు.‌ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాగే ఎంపిలు కూడా తమ దొంగ బుద్ధిని ప్రదర్శించారని, సమైక్యాంధ్ర విషయంలో వానిరి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం నోట్‌ రావడంతో బట్టబయలైందని ఆయన విమర్శించారు. సమైక్యవాదానికి టిడిపి కట్టుబడి లేదన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని రమేష్ అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ కోసం వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందని జోగి రమేష్ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top