మాజీ ఎంపీలపై టీడీపీ నేతల ఫిర్యాదు


న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీలపై టీడీపీ ఫిర్యాదు చేసింది. వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీలు ధర్నా చేస్తున్నారని టీడీపీ నాయకులు సెక్యురిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో పార్లమెంట్‌ ఆవరణలో ఫ్లకార్డ్సు పట్టుకుని నిరసన తెలపడంపై సెక్యూరిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మా పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామని మాజీ ఎంపీలు పేర్కొన్నారు. టీడీపీ తీరును వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. టీడీపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే మిన్న అని మండిపడ్డారు.
 
Back to Top