వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్యే దాడి


కాకినాడ: ఏపీ శాసన మండలి డిప్యూటి చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెలే జగ్గిరెడ్డి ఇసుక మాఫియాపై అధికారులను ప్రశ్నించడంతో ఆవేశానికి గురైన రెడ్డి సుబ్రమణ్యం జగ్గిరెడ్డిపై నేమ్‌ ప్లేట్లు, వాటర్‌ బాటిల్‌ విసిరారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేను తీవ్రంగా దూషించారు. ఈ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ పాలనలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సహనం కోల్పొయి దాడులకు తెగబడుతున్నారని ప్రతిపక్ష పార్టీ సభ్యులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యంపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండు చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ..ఇక్కడి ఇసుకను విశాఖకు తరలిస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top