ప్రజాప్రతినిధా..? వీధి రౌడీనా..?

–ఎమ్మెల్యేనే నేరుగా దాడిచేస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి
–విలేకర్ల సమావేశంలో వైయస్సార్‌సీపీ నాయకులు

ధర్మవరం: ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి వీధిరౌడీలా తన అనుచరులను తీసుకెళ్లి పొలంలో చెట్లునాటుతున్న రైతులపై దాడిచేసి గాయపర్చడం ఎంతవరకు సమంజసమని,టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై వైయస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక కేతిరెడ్డి నివాసంలో ఆపార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, జిల్లా కార్యదర్శి తొండమల రవిలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం నాడు మలకవేముల క్రాస్‌లో కోటీశ్వరరెడ్డి అనే వ్యక్తిపై ఎమ్మెల్యే, అతని అనుచరులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకులు నియోజవకర్గమంలో శాంతిభద్రతలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను కొట్టారు..ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే నేరుగా వెళ్లి పొలంలో పనిచేసుకుంటున్న తమ పార్టీనాయకున్ని, ఓ దళిత యువకున్ని కులం పేరుతో ధూషిస్తూ దాడి చేసి గాయపర్చడం గర్హనీయమన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధే.. వీధి రౌడీలా వ్యవహరించి నేరుగా దాడులకు దిగితే ఇంకెక్కడ శాంతిభద్రతలుంటాయని ప్రశ్నించారు. చంద్రబాబు అభివృద్ధిలో పోటీపడుతున్నామని గొప్పలకు పోతున్నాడు కానీ.. నియోజకవర్గాల్లో జనాల్ని హింసించడంలో ఆ పార్టీ నాయకులు పోటీ పడతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ఇందుకు తగ్గమూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైయస్సార్‌సీపీని దెబ్బతీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఇందుకు తాము వెరవబోమన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్‌ చందమూరి నారాయణరెడ్డి, సర్పంచ్‌ మధుసూధనరెడ్డి, నాయకులు జిఆర్‌ రామ్మోహన్, చౌడయ్య, కుమారస్వామి, పెద్దన్న, మాసపల్లి సాయికుమార్, అక్బర్‌ ఖాన్, ఎస్‌వి రమణారెడ్డి, అప్రాశ్చెరువు ఈశ్వరరెడ్డి, చందు, అంజి, బాలం గోపాల్, సరితాల బాషా, రంగస్వామి, నాగానందరెడ్డి, సోలిగాళ్ల నాగరాజు, వంట రమేష్, అంజన్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top