టీడీపీ ఎమ్మెల్యే బండారం బయటపెడతా

నెల్లూరు: అధికార అండతో టీడీపీ నేతలు విలువైన భూములను ఆక్రమించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొవ్వూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎమ్మెల్యే ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీడీపీ తొత్తులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి భూ కబ్జాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, విచారణ చేపడితే ఆ ఆధారాలను బయటపెడతానని ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని భూదందాపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top