పోలీసులు అధికార పార్టీకి తొత్తులా..?

కొల్లం కుటుంబీకులపై తప్పుడు కేసులు
అవగాహన లేని మంత్రులు జిల్లాకు రావడం దేనికి?
జిల్లా అభివృద్ధి కోసం పర్యటించండి
విలేకరుల సమావేశంలో
కొరముట్ల, ఆకేపాటి

కడప: జిల్లాలో పోలీసులు అధికారపార్టీకి.. హోంమంత్రికి తొత్తులా అని వైఎస్‌ఆర్ కడప జిల్లా   ైరె ల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల ప్రశ్నించారు.  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో కలిసి రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల  సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రులు వరుసపెట్టి జిల్లాలో పర్యటించేటప్పుడు అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాను అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు రూపొందించాలే తప్ప కేవలం వైఎస్సార్‌సీపీనే టార్గెట్ చేసుకుని కక్షసాధింపు కోసం పర్యటించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమని అన్నారు. బాబు 8 నెలల పాలనలో ఎన్నికల వాగ్దానాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధిని చేపట్టలేకపోయారన్నారు. కొల్లం గంగిరెడ్డిపై కేసు కొట్టివేసినా వైస్సార్‌సీపీపై ఉన్న కక్షసాధింపుతో అక్రమ కేసులు పెట్టించడం, అలాగే డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డిపై రాజకీయంగా అణగదొక్కేందుకు తప్పుడు కేసులు పెట్టించడం, పదే పదే అబాండాలు వేస్తూ కొల్లం కుటుంబీకులే టార్గెట్‌గా చంద్రబాబు పాలన జిల్లాలో సాగుతోందన్నారు.
Back to Top