గ్రేట‌ర్ విశాఖ‌లో తెలుగుదేశం అక్రమాల వెల్లువ‌

హైదరాబాద్:   గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్దం చేసింద‌ని వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి కొయ్య ప్ర‌సాద్ ఆరోపించారు. ఇందుకోస విశాఖ ప‌రిస‌ర ప్రాంతాల్లోని భూముల‌పై క‌న్ను వేశార‌ని మండిప‌డ్డారు. భీమిలీ సొసైటీ అక్ర‌మాల‌కు బాధ్యుడైన గంటా శ్రీనివాస‌రావు..  ఇప్పుడు అక్ర‌మాల మీద క‌మిటీ వేస్తాన‌ని చెప్ప‌టం హాస్యాస్పదం అని అన్నారు. విశాఖలో అండర్ గ్రౌండ్ బజారు ఏర్పాటుచేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ కాంట్రాక్టులు టీడీపీకి చెందినవారికే దక్కేలా పావులు కదుపుతోందని ప్రసాద్ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. 
Back to Top