రెచ్చిపోయిన పచ్చనేతలు..కార్పొరేషన్ లో కుర్చీల లొల్లి

కడప మునిసిపల్ కార్పొరేషన్ లో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కుర్చీల కోసం బాహాబాహీకి దిగారు. తాము చెప్పినట్లు కుర్చీలు వేయలేదంటూ సమావేశంలో టీడీపీ సభ్యులు నానా రభస చేశారు. టీడీపీ నేతలు మేయర్ పోడియం వద్దకు ఆగ్రహంగా దూసుకెళ్లారు. వారిని అడ్డుకోబోయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దాడికి యత్నించారు. తమకు కుర్చీలు వేయలేదంటూ ఆవేశంతో మైకులు విరగొట్టారు. మేయర్, వైయస్ఆర్ సీపీ సభ్యులు నచ్చజెప్పినా.. టీడీపీ సభ్యులు వినకుండా గొడవకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Back to Top