ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీడీపీ

ప్యాపిలి: ప్రజలు ఎంతో నమ్మకంతో టీడీపీకి పట్టం కడితే మూడేళ్ల కాలంలోనే వారి విశ్వాసాన్ని కోల్పోయిందని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొమ్మేమర్రి గ్రామానికి చెందిన దాదాపు 20 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. గ్రామానికి చెందిన మాజీ డీలర్‌ సూర్యనారాయణరెడ్డి, టీడీపీ కార్యకర్తలు నారాయణస్వామి, అల్లావలి, చంద్రమౌళీశ్వరరెడ్డి, నాగ హుసేనప్ప, నెట్టికంటి, వెంకటేశ్వరరెడ్డి తదితరులతో పాటు 20 మంది పార్టీలోకి చేరారు. ఈ మేరకు వారిని పీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం పని చేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పీఏసీ ఛైర్మన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డోన్‌ జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, హుసేనాపురం సింగిల్‌విండో అద్యక్షులు సీమ సుధాకర్‌రెడ్డి, మాజీ సింగిల్‌ విండో అద్యక్షులు గడ్డం భువనేశ్వరరెడ్డి, వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు సిద్దనగట్టు చంద్రశేఖర్‌రెడ్డి, నేరేడుచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top