వైయస్‌ఆర్‌సీపీలోకి దూళిపాళ్ల నరేంద్ర అనుచరులు

గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది. అధికార పార్టీ నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ నాయకులు కలిసి పార్టీలో చేరుతామని పేర్కొన్నారు. ప్రధానంగా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రధాన అనుచరుడు, పొన్నూరు జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు వైయస్‌ఆర్‌సీపీలో చేరబోతున్నారు. సాయంత్రం పొన్నూరులోని ఐల్యాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. వీరి చేరికతో నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ బలోపేతం కానుందని స్థానికులు పేర్కొటున్నారు.  
 
Back to Top