తెలుగుతమ్ముళ్ల గుండెల్లో గుబులు

గుంటూరు (పట్నంబజారు): ఐడీఎస్‌ వివరాలు వెల్లడించాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రికి లేఖ రాయడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో భయం పట్టుకుందని వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అరండల్‌పేటలోని నగరపార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగే...దొంగ  అని అరిచిన చందాన టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని,   వైయస్ జగన్, వైయస్సార్‌ సీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఐడీఎస్‌ స్కీంలో రూ.10 వేల కోట్లు ఒక్కరే కట్టారని వైయస్సార్‌ సీపీపై గ్లోబెల్‌ ప్రచారం చేస్తున్న నేతలు దమ్ముంటే ఆవివరాలు ఎవరిచ్చారో వారి పేర్లను బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టలేదని దుయ్యబట్టారు. కేవలం వైయస్సార్‌ సీపీ నేతలపై నోరుపారేసుకుని చంద్రబాబు, లోకేష్‌ల వద్ద పేరు సంపాదించాలన్న తాపత్రయంతో మంత్రులు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు వివరాలు చెప్పినట్లుగా టీడీపీ నేతలు ప్రచారాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు
Back to Top