టీడీపీ నేత కుమారుడి వికృతి చేష్ట‌లు

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక రోజుకో చోట తమ్ముళ్ల లీలలు వెలుగులోకి వస్తున్నాయి.అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌హిళా అధికారిణి జుట్టుప‌ట్టి ఈడ్చుకెళ్ల‌గా, నిన్న అనంత‌పురం జిల్లాలో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన సుధ‌మ్మ అనే మ‌హిళ‌ను టీడీపీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ అనుచ‌రులు కాళ్ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అక్కినేమి లోకేశ్వరరావు తనయుడి వికృత చేష్టలు బయటపడ్డాయి. లోకేశ్వరరావు కుమారుడు విజయకృష్ణ గత కొన్ని రోజులుగా ఓ ఎన్నారై మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో సదరు మహిళ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు గురువారం విజయకృష్ణను అరెస్ట్‌ చేశారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Back to Top