గుడివాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్‌

కృష్ణా: గుడివాడలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఓవరాక్షన్‌ చేశారు. స్థానిక 19వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముందు బాణా సంచా కాల్చి అల్లరి చేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అంతటితో ఊరుకోకుండా వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉదృక్తం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Back to Top