దేవుడి భూములను కూడా టీడీపీ నేతలు వదలడం లేదు

గుంటూరు: టీడీపీ నాయకులు దేవుడి భూములను కూడా వదలడం లేదని వైయస్‌ఆర్‌సీపీ పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు, దారుణాలకు అంతే లేకుండా పోయిందన్నారు. 600 హామీలను ఎన్నిలకు ముందు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో ఏ  ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. నాడు తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా తెస్తామన్న చంద్రబాబు ఈ రోజు ప్యాకేజీని స్వాగతించారన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్‌ దేవుడి భూములను కూడా వదల్లేదన్నారు. సదావర్తి సత్రం భూములను స్వాహా చేశారన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వేలాది లారీల్లో ఇసుకను తరలిస్తూ టీడీపీ నేతలు లక్షలాది రూపాయలు సంపాదించారన్నారు. నీరు–చెట్టు, పుష్కరాల పేరుతో దోచుకుతింటున్నారని విమర్శించారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఇదే రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మన నియోజకవర్గానికి వచ్చారని గుర్తు చేశారు. 
Back to Top