రాబందుల్లా దోచుకుతింటున్న టీడీపీ నేతలు

  • మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ్మినేని, ధర్మాన, రెడ్డిశాంతి
ఆముదాలవలస: రాష్ట్ర ప్రజల సొత్తును రాబందుల్లా దోచుకుతింటున్న టీడీపీ నాయకులను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైపర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్‌ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని, జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి, ధర్మాన కృష్ణదాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మూడేళ్ల ప్రజా పాలనను నిర్వీర్యం చేస్తూ స్వలాభానికి పాటుపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే గద్దె దిగాలని... బాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియా ఇలా నియోజకవర్గ ప్రజల సొత్తును వందల కోట్లలో దోచుంతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్లీనరీ తరపున ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. అసలు ఫ్యాక్టరీ మూతపడేందుకు చంద్రబాబే కారణం అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారన్నారు. పార్టీలో కొత్తవారిని చేర్చేలా గ్రామస్థాయిలో బూత్‌ కమిటీలు శ్రమించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పేరాడ తిలక్, చింతాడ మంజు, దువ్వాడ శ్రీనివాసరావు, వరుదు కల్యాణి, గొర్లె కిరణ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సువ్వారి గాంధీ, రమేష్, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మోహన్‌రావులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
Back to Top