వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన టీడీపీ నేతలు

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని, మోసాలు చేసే పార్టీలో ఉండలేమని వారంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top