వైయస్సార్‌సీపీలోకి చేరికలు

పామర్రు: టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనతో విసుగుచెందిన తమ్ముళ్లు ఆ పార్టీని వీడి వైయస్సార్‌సీపీలో చేరుతున్నారు. వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌ సమక్షంలో వీరాంజనేయ కాలనీకి చెందిన  పలువురు టీడీపీ నేతలు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ.... గత మూడున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారన్నారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా హిత కార్యక్రమాలకు ఆకర్షితులై, నవ్యాంధ్రకోసం జగన్‌ ప్రవేశ పెట్టిన నవరత్నాలకు ఆసక్తి చూపుతూ పార్టీలోకి వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు మాజీ మెంబరు సూరవరపు వెంకటేశ్వరరావు గతంలో టీడీపీ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణానంతరం టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకునే వారే లేక పోయారని వెంకటే శ్వరరావు కుమారుడు ఆరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అటువంటి పార్టీలో పని చేసినందుకు ఎంతగానో బాధ పడుతున్నానన్నారు.  ఇక నుంచి తన సేవలను వైయస్సార్‌సీపీకి అందజేసి పార్టీ విజయం సాధించే వరకు తన వంతుగా పోరాడతానని తెలిపారు. ఆరుణ్‌కుమార్‌తో పాటుగా పోలిమెట్ల నాగేశ్వరరావు, గుమ్మల రాజు, యర్రంశెట్టి కౌషల్, ఉయ్యూరు శివ తదితర సుమారు 20 మంది వైయస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్‌ ఆరేపల్లి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి పెయ్యల రాజు, పార్టీ నేతలు దొంతిరెడ్డి శ్రీరామిరెడ్డి, బొమ్మారెడ్డి అప్పిరెడ్డి, మధుసూధనరెడ్డి, బాల వెంకటేశ్వరరెడ్డి, తాడిశెట్టి శ్రీనివాసరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top