వంద మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

అనంతపురం: చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు ఆ పార్టీ నేతలు సైతం కదం తొక్కుతున్నారు. టీడీపీ అరాచకాలతో విసిగిపోయి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు  కప్పి ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌ పాలనను అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ పోరాటాలు నచ్చి ఇతర పార్టీల నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారన్నారు. 
Back to Top