వైయస్సార్‌సీపీలోకి పలువురి చేరిక

ఆత్మకూరు: మండలంలోని మదిగుబ్బ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు మంగళవారం వైయస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యుడు (టీడీపీ) యనమల సర్దానప్ప, యనమల గంగన్న, గోపాల్‌, యనమల పెద్దన్న తదితర కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి మాటున మంత్రి పరిటాల సునీత సాగిస్తున్న అరాచకాలను టీడీపీకి చెందిన వారే భరించలేకపోతున్నారని అన్నారు. అందుకే టీడీపీని వీడి వైయస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైయస్సార్‌ సీపీ అభ్యున్నతి కోసం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, సింగల్‌ విండో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, మండల యువజన నాయకుడు మదిగుబ్బ నరసింహులు, మండల ఉపాధ్యక్షుడు పెద్దయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబుళపతి, మాజీ ఎంపీపీ హనుమంతు నాయక్‌, మదిగుబ్బ వైయస్సార్‌సీపీ నాయకులు రామాంజినేయులు, పోతన్న, దూదేకుల అల్లాబకాష్, గోపాల్‌నాయక్, పోతులయ్య, మాధవరెడ్డి, రాజేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.

Back to Top