విశాఖ‌లో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

అనకాపల్లి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోరాటాల‌కు ఆక‌ర్షితులై అధికార పార్టీ నేత‌లు సైతం వైయ‌స్ఆర్ సీపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డుతున్నార‌ని పార్టీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. అనకాపల్లి పట్టణంలోని పూడిమడక రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో వేటజంగాలపాలేనికి చెందిన టీడీపీ నాయకులు వైయ‌స్సార్‌ సీపీలో చేరారు. వారందరికీ అమర్‌నాథ్‌ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర్ మాట్లాడుతూ ...నియోజకవర్గంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. పార్టీలో చేరిన వారిలో వేటజంగాలపాలెం టీడీపీ మాజీ అధ్యక్షులు నడిశెట్టి సత్తిబాబు, సిగిరెడ్డి వెంకటేశ్వరరావు, బండి చినగోవింద, నడిశెట్టి కొండలరావు, గోనా పెదగోవింద, బేమిని శ్రీనివాసరావు, బండి శ్రీనివాసరావు, బండి అర్జున, మల్లెల వెంకటరమణ, నడిశెట్టి జగదీశ్, బొండా నాయుడు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్‌తో పాటు వేటజంగాలపాలేనికి చెందిన బొడ్డు యాకూబ్, మడక అప్పారావు, ఈశ్వరరావు, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top