టీడీపీ నుంచి వైయస్సార్‌ సీపీలోకి చేరిక

మాచవరంః స్థానిక పద్మశాలీయ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో వైయస్సార్‌ సీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తానని నమ్మించి మోసం చేసిందని , ప్రభుత్వ పాలనా విధానం వలన చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని  ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల సంక్షేమం కొరకు నిధి ఏర్పాటు చేసి, వారి అభివృద్ధికి పాటు పడతామని తెలిపారు. వైయస్సార్‌ సీపీలో చేరిన వారిలో వంగర అనిల్‌కుమార్‌ ,శ్రీరాములు బాబూరావు, శ్రీరాముల గోపీనాథ్ ,జంజనం వెంకటేష్‌ గంజి మధు, , వంగర రామారావు, అక్కల కోటే శ్వరావు,గోలి వెంకటేష్‌ , గంజి కామేశ్వరావు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చౌదరి సింగరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్‌ కుమార్‌ , ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ శివయాదవ్‌ , పార్టీ సీనియర్‌ నాయకులు వంకాయల లక్ష్మీనారాయణ,మండల నాయకులు మహమ్మద్‌ జానీ , యూత్‌ కన్వీనర్‌ వెంకటనరసింహారెడ్డి , సోసైటీ అధ్యక్షులు వట్టె రామిరెడ్డి , గోలి రంగా , ఉప సర్పంచ్‌ లక్ష్మీకాంతం , కావాటి కర్ణ పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top