విశాఖలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

విశాఖ‌ప‌ట్నంః చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌ను సహించలేక, టీడీపీలో కొన‌సాగ‌లేక ఆ పార్టీ నేతలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ పాయ‌కారావుపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గొల్ల బాబురావు స్ప‌ష్టం చేశారు. పాయ‌కారావుపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని న‌క్క‌ప‌ల్లి మండ‌లం టీపీపాలెం, రామాపురం గ్రామాల‌కు చెందిన 200 మంది టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోఆర్డినేట‌ర్లు గొల్ల బాబురావు, వీసం రామ‌కృష్ణ‌లు వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా బాబురావు మాట్లాడుతూ... ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పూర్తి వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, అందుకు ఈ వ‌ల‌స‌లే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 

Back to Top