రాప్తాడులో వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు

అనంతపురంః వైయస్సార్సీపీలోకి జిల్లాలో వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు అవినీతి, అరాచకాలతో విసిగిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాప్తాడు మండలం ఎర్రగుంటపల్లిలో టీడీపీకి చెందిన నాయకులు పెద్ద మొత్తంలో వైయస్సార్సీపీలో చేరారు. రాప్తాడు నియోజకవర్గ  సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైయస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా, వైయస్ జగన్ ను సీఎం చేయడం కోసం తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే టీడీపీకి చెందిన ఎంపిపి, ఎంపిటిసిలు వైయస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Back to Top