వైయస్సార్సీపీలో చేరిన బనగానపల్లె తమ్ముళ్లు

కర్నూలుః సంజామల మండలం అక్కంపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు భారీగా వైయస్సార్సీపీలో చేరారు.  మల్లేష్ రెడ్డి , చక్రపాణి రెడ్డి , నాగేశ్వర్ రెడ్డి, కేశాలు రెడ్డి,చంద్ర మోహన్ రెడ్డిలతో పటు మరో 50 కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరాయి.  నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్కం పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టే నాధుడే లేని సమయంలో తాము ముందుండి పార్టీ కోసం కష్టపడి టీడీపీ నేతను గెలిపిస్తే, తమపైనే కేసులు నమోదు చేయించాడని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్ జగన్ కు  అండగా నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే తాము వైయస్సార్సీపీలో చేరామని తెలిపారు.

Back to Top