టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి భారీ వలసలు

వైయస్ఆర్ కడప(రాయ‌చోటి))టీడీపీ నుంచి వైయ‌స్ఆర్ సీపీ లోకి వ‌ల‌స‌ల ప‌రంప‌ర ప్రారంభ‌మైంద‌ని పార్ల‌మెంట్ స‌భ్యుడు మిథున్ రెడ్డి పేర్కొన్నారు. మండ‌లంలోని అనంత‌పురం గ్రామం టీడీపీ ఎంపీటీసీ స‌భ్యురాలు ఎన‌మ‌న కొండ‌మ్మ‌తో పాటు 100కుటుంబాల వారు వైయ‌స్ఆర్ సీపీ లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గ‌డ‌ికోట శ్రీకాంత్ రెడ్డితో క‌ల‌సి ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు పాల‌న‌పై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త మొద‌లైంద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నిక‌ల కోసం ఎదురుచూస్తున్నార‌ని, ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా గట్టిగా గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నార‌న్నారు. వైయస్  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారని తెలిపారు.

ప్ర‌త్యేక హోదా ఈ రాష్ట్రానికి ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందేన‌ని, అయితే చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో సైతం తీర్మానం చేశార‌ని నేడు మాత్రం హోదా అక్క‌ర్లేద‌ని చెప్ప‌డం ప్ర‌జ‌లను మోసం చేయ‌డ‌మేన‌న్నారు. ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... పంటలు కోల్పోయిన రైతుల‌కు గ‌త మూడేళ్లుగా ఇన్సూరెన్స్ కానీ, ఇన్ పుట్ స‌బ్సీడీ కానీ ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర నాయ‌కులు మ‌ద‌న మోహ‌న్ రెడ్డి, మండ‌ల ఉపాధ్య‌క్షులు శిద్ధ‌క రామ‌చంద్రారెడ్డి, నాయ‌కులు శ్రీధ‌ర్, ముర‌ళి, రాజ‌బాబు, గ‌ణ‌ప‌తి, రెడ్డెయ్య‌, ప్ర‌సాద్, ప్ర‌భాక‌ర్ రెడ్డి, స‌మ‌ర‌సింహ్మారెడ్డి, జ‌నార్ధ‌న్ రెడ్డి పాల్గొన్నారు.
Back to Top