టీడీపీ నుంచి వైయ‌స్సార్సీపీలోకి భారీ చేరికలు

అనంత‌పురం(శెట్టూరు):  టీడీపీ న‌యవంచ‌న పాల‌న‌పై ప్ర‌జ‌ల తిరుగుబాటు మొద‌లైంది. చంద్ర‌బాబు మోసాల‌ను ప‌సిగ‌ట్టిన ప‌లువురు టీడీపీని విడి ప్ర‌జ‌ల ప‌క్ష‌న పోరాడుతున్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయ‌స్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌, పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్ సోమ‌నాథ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు వ‌డ్డే రామ‌న్న‌, ఈడిగ చిన్నసిద్ద‌ప్ప‌, వ‌డ్డే నాగ‌రాజు, ఈర‌మ్మ‌, చిట్టెమ్మ‌, వ‌డ్డె రామాంజిన‌మ్మ‌, ఈడిగ మారెక్క‌, చెర్లోప‌ల్లి గ్రామ వార్డుమెంబ‌ర్ చిక్క‌న్న‌, మాజీ వార్డుస‌భ్యులు జ‌య‌మ్మ‌, హ‌నుమ‌న్న‌ల‌తో పాటు మరికొన్ని కుటుంబాల వారు వైయ‌స్సార్ సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ పార్టీ కండువాలు క‌ప్పి వారిని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయస్సార్‌సీపీ నాయ‌కులు మ‌ల్లేశ‌ప్ప‌, సూర‌ప్ప‌, సుధాక‌ర్‌రెడ్డి, ఆనంద‌ప్ప‌, తిమ్మ‌రాజు, రామ‌చంద్ర‌, నీల‌కంఠ‌, ప్ర‌కాష్‌, రామ‌ప్ప‌, శంక‌ర్ త‌దిత‌రులున్నారు. 
Back to Top