వైయస్సార్సీపీలోకి టీడీపీ నేతలు

అనంతపురం : అభివృద్ధిని పక్కన పెట్టేసి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని వైయస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రాప్తాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని  మంత్రి పరిటాల సునీత ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వారి బంధువులు, అనుచరులు ప్రతి పనిలోనూ పర్సెంటేజీలు  తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై విసిగి వేసారే టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో వలసలు మరింత పెరుగుతాయన్నారు.

తాజా ఫోటోలు

Back to Top