వైయస్సార్సీపీలో చేరిన యువనాయకులు

అనంతపురంః జిల్లాలో టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం పార్టీని వదిలి వైయస్సార్సీపీలో చేరారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో యువ నాయకులు వైయస్సార్సీపీలో చేరిపోయారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైయస్ జగన్ ఆశయం, నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు  ప్రకాష్ రెడ్డి సాగిస్తున్న పోరాటానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు యువనేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు చెప్పారు.

Back to Top