వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు

గుంటూరు(నర్సారావుపేట): వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుర్నీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున టీడీపీ నేతలు వైయస్సార్సీపీలో చేరారు. రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి గ్రామానికి చెందిన కంది అంజిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు, ఇతర టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వైయస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు కందిబ్రదర్స్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా కృషిచేస్తామని వారు చెప్పారు.


To read this article in English:  http://bit.ly/27gqBvl 

Back to Top