పశ్చిమగోదావరిలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు

పశ్చిమగోదావరిః జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు ఎలాంటి గౌరవం లేదని  నేతలు పేర్కొన్నారు. తెలుగుదేశం విధానాలు నచ్చక, ఆపార్టీపై విరక్తి చెంది పార్టీని వీడామన్నారు. తెల్లం దుర్గారావు ఆయన అనుచురులు 200 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషిచేస్తామన్నారు.  

టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా...ప్రజలకు ఇంతవరకు పైసా పనిచేయలేదని వారు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు...రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులు అందరినీ మోసం చేశాడన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలకోసం పోరాడుతున్న వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కోలేక ...చంద్రబాబు, మంత్రులు జననేతపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. బాబు రాష్ట్ర సమస్యలను పూర్తిగాలికొదిలేశారని ఫైరయ్యారు. 
Back to Top