వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు

వైయస్సార్ జిల్లాః  జమ్మలమడుగు పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డితో పాటు అతని అనుచరులు ...కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  టీడీపీ అభివృద్ధి కోసం ఎంత కష్టపడినా నాయకులకు ఆపార్టీలో గుర్తింపు ఉండదని మహేశ్వర రెడ్డి అన్నారు. వైయస్ జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో వైయస్సార్సీపీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు, ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర నేతలు శంకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో.... మైలవరం మండలం బెస్తవేముల, బి. జంగాలపల్లి గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

Back to Top